మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ వైసీపీ నుంచి సస్పెన్షన్
ABN , Publish Date - Jan 04 , 2025 | 01:01 AM
మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ గుడబండి ఆదిలక్ష్మిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో(3ఎస్‌బిఎమ్4,5) : అమృతపురం రెవెన్యూ పరిధి సూరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో గ్రావెల్ తవ్వకాలతో ఏర్పడిన గొయ్యి
హైవే భూముల్లో గ్రావెల్ తవ్వకాలు
సాగర మాల రింగు రోడ్డు స్థలంలో అక్రమార్కుల విధ్వంసం
రాత్రిపూట తవ్వకాలు, తరలింపు
ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. ఆగని దందా
ఎమ్మెల్యే ఆదేశాలను అమలుచేయని అధికారులు
సబ్బవరం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) :
సబ్బవరం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్నప్పటికీ వైసీపీ జమానా తరహాలోనే సహజ వనరుల దోపిడీ కొనసాగుతున్నది. గత ప్రభుత్వంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరిపిన వ్యక్తులే ఇప్పుడు కూడా తమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ నాయకులను ‘మంచి చేసుకుని’ గ్రావెల్ తవ్వకాలు, రవాణా, అమ్మకాలు జరుపుతున్నారు.
అమృతపురం రెవెన్యూ పరిధి సూరెడ్డిపాలెం వద్ద అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి, సబ్బవరం-షీలానగర్ (సాగరమాల) రోడ్డు కలిసే ప్రాంతంలో డబుల్ ట్రంపెట్ నిర్మాణానికి 57 ఎకరాలను రైతుల నుంచి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సేకరించారు. సాగరమాల రోడ్డు పనుల్లో జాప్యం జరగడంతో ఆ భూముల్లో నుంచి గ్రావెల్ తవ్వుకుపోతున్నారు. జాతీయ రహదారి పక్కనే వున్న ప్రైవేటు స్థలంలో డంప్ చేశారు. కాగా పైడివాడ, పైడివాడఅగ్రహారం, అసకపల్లి, పల్లవానిపాలెం, గంగవరం, నంగినారపాడు గ్రామాల్లో కూడా రాత్రిపూట గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారు.
అమలుకాని ఎమ్మెల్యే ఆదేశాలు
గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలపై అధికారులు నిఘా పెట్టి తవ్వకందారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు పదేపదే చెబుతున్నప్పటికీ స్థానిక అధికారులు అమలు చేయడంలేదు. ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో కూడా ఆయన గ్రావెల్ అక్రమ తవ్వకాలకు సంబంధించి తీవ్ర హెచ్చరికలు చేశారు. అయినాసరే గ్రావెల్ తవ్వకాలు మాత్రం ఆగలేదు.
అనుమతులు ఇవ్వకపోవడంతోనే..
ఇళ్ల నిర్మాణంలో పునాదులు ఎత్తు చేయడానికి, పశువుల కల్లాల ఏర్పాటు, లోతట్టుగా వున్న ఖాళీ స్థలాలను ఎత్తు చేయడానికి గ్రావెల్ లేదా మట్టి అవసరం. ఇటువంటి చిన్నపాటిఅవసరాలకు సైతం గ్రావెల్ తవ్వకాలకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు అనుమతులు ఇవ్వకపోవడం అక్రమార్కులకు కలిసొస్తున్నది. స్థానిక అవసరాలకు తాత్కాలిక అనుమతులు ఇస్తే, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట పడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
నర్సీపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ మాజీ చైర్‌పర్సన్ గుడబండి ఆదిలక్ష్మిని వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ ఆదేశాలను ధిక్కరించి, ప్రస్తుతం అధికారంలో వున్న పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.