Share News

ఎట్టకేలకు ఆశ్రమ భవనాల పనులకు కదలిక

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:38 PM

ఎట్టకేలకు మండలంలోని మంప, శరభన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల అదనపు వసతి భవనాలు సిద్ధమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా దర్శనమిచ్చిన ఈ భవనాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఊపందుకున్నాయి. త్వరలో వీటిని అందుబాటులోకి తేవడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

ఎట్టకేలకు ఆశ్రమ భవనాల పనులకు కదలిక
సిద్ధమవుతున్న శరభన్నపాలెం ఆశ్రమ పాఠశాల అదనపు వసతి భవనం

గత వైసీపీ ప్రభుత్వంలో మంప, శరభన్నపాలెంలోని నిర్మాణాలకు బ్రేక్‌

బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిలిపివేసిన కాంట్రాక్టర్లు

కూటమి ప్రభుత్వం వచ్చాక పునఃప్రారంభం

కొయ్యూరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు మండలంలోని మంప, శరభన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల అదనపు వసతి భవనాలు సిద్ధమవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో అసంపూర్తిగా దర్శనమిచ్చిన ఈ భవనాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఊపందుకున్నాయి. త్వరలో వీటిని అందుబాటులోకి తేవడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

మండలంలోని మంప, శరభన్నపాలెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వసతి సమస్య ఉందని గుర్తించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం 2018లో అదనపు వసతి భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. మంప పాఠశాలకు రూ.2 కోట్లు, శరభన్నపాలెం పాఠశాలకు రూ.2 కోట్లు మంజూరు చేసింది. పనుల పర్యవేక్షణ బాధ్యతను గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగానికి అప్పగించింది. మంపనకు సంబంధించి కాంట్రాక్టర్‌ సుమారు రూ 1.3 కోట్ల మేర పనులు నిర్వహించగా, శరభన్నపాలేనికి సంబంధించి కాంట్రాక్టర్‌ రూ.90 లక్షల మేర 2020 సంవత్సరంలో పనులు పూర్తి చేశారు. అయితే ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. దీంతో పనులను నిలిపివేశారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో ఇప్పుడు పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - Jan 07 , 2025 | 11:38 PM