పరసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:05 AM
జీవీఎంసీ గాజువాక జోనల్‌లోని అన్ని వార్డులలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఏడీసీ బి.సోమన్నారాయణ ఆదేశించారు. గాజువాకలోని జోనల్ కార్యాయలంలో శనివారం శానిటరీ కార్యదర్శులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు.

జీవీఎంసీ ఏడీసీ బి.సోమన్నారాయణ
గాజువాక, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): జీవీఎంసీ గాజువాక జోనల్‌లోని అన్ని వార్డులలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఏడీసీ బి.సోమన్నారాయణ ఆదేశించారు. గాజువాకలోని జోనల్ కార్యాయలంలో శనివారం శానిటరీ కార్యదర్శులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏడీసీ మాట్లాడుతూ వార్డుల్లో ఎక్కడా చెత్తాచెదారం పేరుకుపోకుండా చూడాలని, ఇంటింటికీ పారిశుద్ధ సిబ్బంది వెళ్లి తప్పనిసరిగా చెత్త సేకరించాలని సూచించారు. తడి-పొడి చెత్తను వేర్వేరుగా తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారిశుధ్య నిర్వహణ పనులను చేపట్టాలని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గాజువాక ముందుండాలని సోమన్నారాయణ ఆకాంక్షించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, ఏఎంహెచ్‌వో కిరణ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.