Share News

గుండెపోటుతో దువ్వాడ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - Jan 27 , 2025 | 07:38 PM

దువ్వాడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మన్నెం రవి (56) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఇక్కడి ముస్తఫా జంక్షన్‌లో నివాసం ఉంటున్న ఆయన ఇంటి నుంచి విధుల నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో రోడ్డు పక్కల వాహనాన్ని ఆపారు.

గుండెపోటుతో దువ్వాడ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి
మృతుడు ఎం.రవి (ఫైల్‌)

కూర్మన్నపాలెం, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): దువ్వాడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మన్నెం రవి (56) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఇక్కడి ముస్తఫా జంక్షన్‌లో నివాసం ఉంటున్న ఆయన ఇంటి నుంచి విధుల నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా మార్గమధ్యంలో గుండెపోటు రావడంతో రోడ్డు పక్కల వాహనాన్ని ఆపారు. దీంతో స్థానికులు హెచ్‌సీ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు అగనంపూడి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి మృతి చెందారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చెందిన మన్నెం రవి 1991 బ్యాచ్‌కు చెందినవారు. ఇటీవలే బదిలీపై దువ్వాడ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. హెచ్‌సీ మృతదేహాన్ని ఏసీపీ టి.త్రినాథ్‌, సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ వెంకటరావు, ఏఎస్‌ఐలు, సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. రవికి భార్య, ఇద్దరు కుమార్తెలు. ఒకఅమ్మాయికి వివాహం చేయగా, మరో కుమార్తె బీటెక్‌ చదువుతుంది. కాగా రవి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం పాయకరావుపేటకు తరలించారు.

Updated Date - Jan 27 , 2025 | 09:32 PM