Share News

జిల్లా ఓటర్లు 20,15,934

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:43 AM

ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025 అనంతరం తుది ఓటర్ల జాబితా సోమవారం విడుదల చేశారు.

జిల్లా ఓటర్లు 20,15,934

పురుషులు 9,94,365, మహిళలు 10,21,450

ముసాయిదా జాబితాతో పోల్చితే 1,968 మంది పెరుగుదల

విశాఖపట్నం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025 అనంతరం తుది ఓటర్ల జాబితా సోమవారం విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలో మొత్తం 20,15,934 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 9,94,365, మహిళలు 10,21,450, ట్రాన్స్‌ జండర్లు 119 మంది ఉన్నారు. పురుషులలో పోల్చితే మహిళలు 27,085 మంది ఎక్కువగా ఉన్నారు.

గత సంవత్సరం అక్టోబరు 29న విడుదల చేసిన ముసాయిదా జాబితాతో పోల్చితే జిల్లాలో 1,968 మంది ఓటర్లు పెరిగారు. ముసాయిదా జాబితా విడుదల తరువాత కొత్తగా 2,455 మంది పురుషులు, 2,657 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జండర్లు...మొత్తం 5,114 మందిని కొత్తగా జాబితాలో చేర్చగా, మరణించడం, డబుల్‌ ఎంట్రీ, వలసపోవడం వంటి వాటికి సంబంధించి 3,416 మంది ఓట్లు జాబితా నుంచి తొలగించినట్టు జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఇక, గత ఏడాది అక్టోబరు 29న జాబితా విడుదల చేసే నాటికి జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన ఓటర్లు 23,292 మంది ఉన్నారు. ఆ తరువాత 1,549 మంది కొత్తగా ఓటు నమోదు చేయించుకోవడంతో వారి సంఖ్య 24,841కు పెరిగింది.

ఇదిలావుండగా జిల్లాలో 3,610 మంది సర్వీస్‌ ఓటర్లు ఉన్నారని, వారిలో పురుషులు 3,494, మహిళలు 116 మంది ఉన్నారని కలెక్టర్‌ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితాను జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజవర్గాల ఎలకో్ట్రరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, సహాయ ఎలకో్ట్రరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి/తహసీల్దారు కార్యాలయాలు, అన్ని పోలింగ్‌ బూత్‌లలో అందుబాటులో ఉంచామన్నారు.

తుది జాబితా మేరకు జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు

నియోజకవర్గం పోలింగ్‌ పురుషులు మహిళలు ట్రాన్స్‌ మొత్తం

కేంద్రాలు జండర్లు

భీమిలి 361 1,78,834 1,85,744 15 3,64,593

విశాఖ తూర్పు 282 1,42,567 1,49,734 20 2,92,326

విశాఖ దక్షిణ 236 1,06,743 1,10,633 33 2,17,409

విశాఖ ఉత్తర 272 1,40,506 1,44,696 22 2,85,224

విశాఖ పశ్చిమ 221 1,05,279 1,08,423 12 2,13,714

గాజువాక 309 1,67,377 1,66,766 12 3,34,155

పెందుర్తి 299 1,53,059 1,55,449 5 3,08,513

మొత్తం 1,980 9,94365 10,21,450 119 20,15,934

Updated Date - Jan 07 , 2025 | 01:43 AM