Share News

జిల్లా ఓటర్లు 12,91,044

ABN , Publish Date - Jan 07 , 2025 | 01:46 AM

ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025 మేరకు తుది ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సోమవారం విడుదల చేశారు.

జిల్లా ఓటర్లు 12,91,044

  • పురుషులు 6,27,984, మహిళలు 6,63,032, థర్డ్‌ జెండర్‌ 28

  • సర్వీసు ఓటర్లు 3,987 మంది

  • తుది జాబితాను విడుదల చేసిన కలెక్టర్‌

  • ముసాయిదా జాబితా కంటే 1,174 మంది ఓటర్లు అధికం

అనకాపల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

ప్రత్యేక సంక్షిప్త సవరణ-2025 మేరకు తుది ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్‌ విజయకృష్ణన్‌ సోమవారం విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలో మొత్తం 12,91,044 మంది ఓటర్లు (సర్వీసు ఓటర్లు కాకుండా) ఉన్నారు. వీరిలో పురుషులు 6,27,984 మంది, మహిళలు 6,63,032 మంది, ట్రాన్స్‌జెండర్లు 28 మంది ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళలు 35,048 మంది ఎక్కువగా ఉన్నారు. కాగా గత సంవత్సరం అక్టోబరు 29న విడుదలచేసిన ప్రత్యేక సంక్షిప్తసవరణ-2025 ముసాయిదా జాబితాలో జిల్లాలో 12,89,870 మంది ఓటర్లు ఉండగా, తాజాగా విడుదలచేసిన తుది జాబితాలో 12,91,044 మంది ఉన్నారు. ముసాయిదా జాబితాతో పోల్చితే 1,174 మంది ఓటర్లు పెరిగారు. ముసాయిదా జాబితా విడుదల తరువాత కొత్తగా 3,044 మంది ఓటర్లుగా నమోదుచేయగా 1,870 మంది మరణించడం/ డబుల్‌ ఎంట్రీలు/ వలసపోయినట్టుగా గుర్తించి జాబితాల నుంచి వారి పేర్లను తొలగించామని జిల్లా ఎన్నికల అఽధికారి, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ తెలిపారు. గత ఏడాది అక్టోబరు 29న ముసాయిదా జాబితా విడుదలచేసిన నాటికి జిల్లాలో 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన ఓటర్లు 16,016 మంది ఉన్నారు. ఆ తరువాత 1,209 మంది కొత్తగా ఓటు కోసం పేర్లు నమోదు చేసుకోవడంతో ఈ సంఖ్య 17,225కు పెరిగింది. ఇదిలావుండగా జిల్లాలో 3,987 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని, వీరిలో పురుషులు 3,851, మహిళలు 136 మంది ఉన్నారని కలెక్టర్‌ పేర్కొన్నారు. తుది ఓటరు జాబితాలను అసెంబ్లీ నియోజవర్గాల ఎలకో్ట్రరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి, సహాయ ఎలకో్ట్రరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి/తహసీల్దారు కార్యాలయాలు, అన్ని పోలింగ్‌ బూత్‌లలో అందుబాటులో ఉంచామన్నారు.

తుది జాబితా మేరకు జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు

అసెంబ్లీ పోలింగ్‌ పురుషులు మహిళలు థర్డ్‌ జెండర్‌ మొత్తం

నియోజకవర్గం కేంద్రాలు

చోడవరం 243 1,05,698 1,12,023 7 2,17,28

మాడుగుల 235 92,028 96,893 2 1,88,923

అనకాపల్లి 251 1,03,140 1,10,728 5 2,13,873

ఎలమంచిలి 246 1,00,683 1,06,339 8 2,07,030

పాయకరావుపేట 292 1,23,528 1,27,563 2 2,51,093

నర్సీపట్నం 262 1,02,907 1,09,486 4 2,12,397

మొత్తం 1,529 6,27,984 6,63,0328 28 12,91,044

సర్వీసు ఓటర్లు 3,851 136 0 3,987

Updated Date - Jan 07 , 2025 | 01:46 AM