సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల పంపిణీ ప్రారంభం
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:05 AM
గిరిజన నిరుద్యోగులకు సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల పంపిణీ ప్రక్రియను గురువారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రారంభించారు. తొలి రోజు 78 మంది అభ్యర్థులు దరఖాస్తులు పొందారు.

తొలి రోజు 78 మంది అభ్యర్థులకు అందజేత
పాడేరు, మార్చి 6(ఆంధ్రజ్యోతి): గిరిజన నిరుద్యోగులకు సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల పంపిణీ ప్రక్రియను గురువారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రారంభించారు. తొలి రోజు 78 మంది అభ్యర్థులు దరఖాస్తులు పొందారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను పూరించి ఈ నెల 13వ తేదీ నాటికి తిరిగి ఐటీడీఏ కార్యాలయంలో సమర్పించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వీఎస్.ప్రభాకరరావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్.రజని, ఐటీడీఏ ఏవో హేమలత, పలువురు టీచర్లు పాల్గొన్నారు.