దట్టంగా పొగమంచు
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:36 PM
మన్యంలో పొగమంచు తీవ్రత తగ్గలేదు. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు దట్టంగానే కమ్మేసింది.

ఉదయం 8 గంటల వరకు వీడని మంచు తెరలు
స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు
పాడేరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): మన్యంలో పొగమంచు తీవ్రత తగ్గలేదు. అలాగే కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు పొగమంచు దట్టంగానే కమ్మేసింది. దీంతో లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగించాయి. ఏజెన్సీలో ఆదివారం జీకేవీధిలో 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, డుంబ్రిగుడలో 10.6, జి.మాడుగులలో 11.0, అరకులోయలో 11.6, ముంచంగిపుట్టులో 12.5, చింతపల్లిలో 12.5, పెదబయలులో 13.2, హుకుంపేటలో 13.9, పాడేరులో 14.1, అనంతగిరిలో 14.8, కొయ్యూరులో 16.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.