Share News

పాడేరులో ఫ్లెక్సీల తొలగింపు

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:25 PM

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు.

పాడేరులో ఫ్లెక్సీల తొలగింపు
అంబేడ్కర్‌ కూడలిలో రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ముసుగు వేస్తున్న వీఆర్‌వో

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో విగ్రహాలకు ముసుగులు

పాడేరురూరల్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం పాడేరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను తొలగించడంతో పాటు ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, ఇందిరాగాంధీ విగ్రహాలకు ముసుగులు వేశారు. ఈ కార్యక్రమంలో పాడేరు-1 వీఆర్‌వో మర్రి చెట్టు రామునాయుడు, పాడేరు-2 వీఆర్‌వో జవ్వాది వెంకటలక్ష్మి, పాడేరు- 3 వీఆర్‌వో జి.రవికుమార్‌, తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:25 PM