విద్యుదాఘాతంతో గిరిజనుడి మృతి
ABN , Publish Date - Feb 26 , 2025 | 10:55 PM
విద్యుదాఘాతంతో ఓ గిరిజనుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మాడగడ గ్రామ పంచాయతీ బోడగుడ గ్రామానికి చెందిన గొల్లోరి పూర్ణ (33), మరో నలుగురు పద్మాపురం పంచాయతీ సినిమాహాల్ జంక్షన్ సమీపంలో కొత్తగా దుకాణం నిర్మాణ పనులకు వచ్చారు.

అరకులోయ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో ఓ గిరిజనుడు మృతి చెందాడు. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మాడగడ గ్రామ పంచాయతీ బోడగుడ గ్రామానికి చెందిన గొల్లోరి పూర్ణ (33), మరో నలుగురు పద్మాపురం పంచాయతీ సినిమాహాల్ జంక్షన్ సమీపంలో కొత్తగా దుకాణం నిర్మాణ పనులకు వచ్చారు. బుధవారం మధ్యాహ్నం రాడ్‌బెండింగ్ పనులు చేపడుతుండగా సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ తీగలు పూర్ణకు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతనిని ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌కు అతి సమీపంలో భవనాలు నిర్మిస్తున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.