తిరుగు ప్రయాణికులతో రద్దీ
ABN , Publish Date - Jan 16 , 2025 | 10:41 PM
పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ గురువారం తిరుగు ప్రయాణికులతో రద్దీగా ఉంది. సంక్రాంతి పండుగకు విశాఖ, అనకాపల్లి, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, వలస కూలీలు తిరుగు ప్రయాణం కావడంతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపుల స్టాండ్ కిటకిటలాడాయి.

పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట
పాడేరురూరల్, జనవరి 16(ఆంధ్రజ్యోతి): పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్ గురువారం తిరుగు ప్రయాణికులతో రద్దీగా ఉంది. సంక్రాంతి పండుగకు విశాఖ, అనకాపల్లి, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, వలస కూలీలు తిరుగు ప్రయాణం కావడంతో పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రైవేటు జీపుల స్టాండ్ కిటకిటలాడాయి. ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసి వెళ్లాయి. బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులతో ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిటలాడింది.