సెయింట్ ఆన్స్ ఘటనపై కలెక్టర్ సీరియస్
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:43 PM
స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు పదవ తరగతి విద్యార్థినులు దాడి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆదివారం ప్రసారమై కలెక్టర్ దినేశ్‌కుమార్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. దీనిపై విచారణ జరపాలని డీఈవో పి.బ్రహ్మాజీరావును ఆదేశించారు.

వార్డెన్‌పై వేటు
హాస్టల్ నుంచి ముగ్గురు బోర్డర్ల తొలగింపు
పాడేరురూరల్, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థినిపై ముగ్గురు పదవ తరగతి విద్యార్థినులు దాడి చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆదివారం ప్రసారమై కలెక్టర్ దినేశ్‌కుమార్ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. దీనిపై విచారణ జరపాలని డీఈవో పి.బ్రహ్మాజీరావును ఆదేశించారు. డీఈవో ఆదేశాల మేరకు ఎంఈవో ఎస్.విశ్వప్రసాద్ విచారణ జరిపి ఆదివారం సాయంత్రం నివేదికను అందించారు. ఆ నివేదిక ఆధారంగా వసతి గృహం వార్డెన్ శ్రావ్యను సోమవారం విధుల నుంచి తొలగించారు. అదే విధంగా 10వ తరగతి చదువుతున్న ముగ్గురు బోర్డర్లను వసతి గృహం నుంచి తొలగించి ఇళ్లకు పంపించారు.
సెయింట్ ఆన్స్‌పై విచారణకు కమిటీ ఏర్పాటు
సెయింట్ ఆన్స్ పాఠశాలను తనిఖీ చేసి హాస్టల్ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా?, లేవా? అనే నిర్ధారించేందుకు కలెక్టర్ నలుగురు సభ్యులతో కమిటీ వేశారు. ఈ కమిటీలో ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్, టీడబ్ల్యూ డిప్యూటీ డైరెక్టర్, ఎంఈవో, ఐసీడీఎస్ పీవోఉన్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ.. ఆ పాఠశాల యాజమాన్యంతో సమావేశమై హాస్టల్‌లో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.