Share News

కలెక్టర్‌కు బెస్ట్‌ ఎలకో్ట్రరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డ్డు

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:05 PM

ఓటరు జాబితా రూపకల్పనలో చక్కని ప్రతిభను చూపినందుకు బెస్ట్‌ ఎలకో్ట్రరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అందుకున్నారు.

కలెక్టర్‌కు బెస్ట్‌ ఎలకో్ట్రరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డ్డు
సీఎస్‌ విజయానంద్‌ చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌

సీఎస్‌ విజయానంద్‌ చేతుల మీదుగా అందుకు దినేశ్‌కుమార్‌

పాడేరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా రూపకల్పనలో చక్కని ప్రతిభను చూపినందుకు బెస్ట్‌ ఎలకో్ట్రరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అందుకున్నారు. ఓటరు దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ తుమ్మలాపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో సీఎస్‌ విజయానంద్‌ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. గత ఏడాది ఓటర్ల జాబితా నమోదు, సవరణలు, తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసినందుకు జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌తోపాటు గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఉపకలెక్టర్‌ వీఎస్‌.లోకేశ్వరరావు, రంపచోడవరం తహసీల్దార్‌ పి.రామకృష్ణ, పాడేరు అసెంబ్లీ స్థానంలోని 153 పోలింగ్‌ స్టేషన్‌కు చెందిన బీఎల్‌వో సౌందర్య, అరకులోయ అసెంబ్లీ స్థానంలోని 294 పోలింగ్‌ స్టేషన్‌కు చెందిన బీఎల్‌వో కె.సుందరరావులను ఈ అవార్డులను అందుకున్నారు. జిల్లా కలెక్టర్‌, నలుగురు రెవెన్యూ అధికారులకు రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కడంపై జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 25 , 2025 | 11:07 PM