జాతీయ మార్కెట్‌లో మరోసారి పెరిగిన కాఫీ ధరలు
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:13 PM
జాతీయ మార్కెట్‌లో కాఫీ ఽధరలు మరోసారి రికార్డు స్థాయిలో పెరిగాయి. బుధవారం కర్ణాటక ఇండియర్ కాఫీ ట్రేడింగ్ అసోసియేషన్(ఐసీటీఏ)లో అరబిక చెర్రీ కిలో పార్చిమెంట్ రూ.552, చెర్రీ రూ.310 ధర పలికిందని పాడేరు కేంద్ర కాఫీ బోర్డు సీనియర్ లైజనింగ్ అధికారి ఎస్.రమేశ్ తెలిపారు.

కర్ణాటక ఐసీటీఏ మార్కెట్‌లో కిలో పార్చిమెంట్ రూ.552, చెర్రీ రూ.310
చింతపల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): జాతీయ మార్కెట్‌లో కాఫీ ఽధరలు మరోసారి రికార్డు స్థాయిలో పెరిగాయి. బుధవారం కర్ణాటక ఇండియర్ కాఫీ ట్రేడింగ్ అసోసియేషన్(ఐసీటీఏ)లో అరబిక చెర్రీ కిలో పార్చిమెంట్ రూ.552, చెర్రీ రూ.310 ధర పలికిందని పాడేరు కేంద్ర కాఫీ బోర్డు సీనియర్ లైజనింగ్ అధికారి ఎస్.రమేశ్ తెలిపారు. ఈ ఏడాది విదేశాల్లో కాఫీ దిగుబడులు భారీగా పడిపోవడంతో దేశ కాఫీ ఉత్పత్తులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీంతో ఐదు రోజులకు ఒకసారి కాఫీ ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. జనవరి 28వ తేదీన పార్చిమెంట్ కిలోకి రూ.490, చెర్రీ కిలో రూ.260 ధర, ఫిబ్రవరి 2న పార్చిమెంట్ కిలో రూ.520, చెర్రీ రూ.280 ధర లభించింది. ప్రస్తుతం ఐసీటీఏలో అరబిక చెర్రీ కిలో పార్చిమెంట్ రూ.552, చెర్రీ రూ.310, రొబస్ట్రా పార్చిమెంట్ రూ.470, చెర్రీ రూ.273 ధర లభించింది. కాగా ప్రాంతీయ మార్కెట్‌లో వ్యాపారులు పార్చిమెంట్ కిలో రూ.450-480, చెర్రీ రూ.260-280 ధరలకు కొనుగోలు చేస్తున్నారు. కాఫీ ధరలు రోజు రోజుకి పెరుగుతుండడంతో ప్రైవేటు వర్తకులు గింజలను కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు.