Share News

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

ABN , Publish Date - Mar 05 , 2025 | 12:57 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి విశాఖపట్నం వస్తున్నారు.

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు రాక

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి విశాఖపట్నం వస్తున్నారు. రాత్రి 11.30 గంటలకు విమానంలో ఇక్కడికి వచ్చి పార్టీ కార్యాలయం ఆవరణలో బస చేస్తారు. మరుసటిరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం గురువారం గీతం యూనివర్సిటీలో ఉంది. దానికి హాజరు అవుతారు. ఇతర అధికారిక కార్యక్రమాలు ఇంకా వెల్లడించలేదు.

ఆర్థిక శాఖా మంత్రి రాక రేపు

కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ నగరానికి వస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నోవాటెల్‌లో జరిగే పోస్ట్‌ బడ్జెట్‌ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి కూడా హాజరవుతారు.

--------------------------------------------------------------------------------------

ముగిసిన ఎన్నికల కోడ్‌

విశాఖపట్నం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కోడ్‌ ఎత్తివేసినట్టు రిటర్నింగ్‌ అధికారి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కోడ్‌ ఎత్తివేసినట్టు పేర్కొన్నారు. కోడ్‌ వల్ల నిలిచిపోయిన అనేక కార్యక్రమాలు ఇకపై యథావిధిగా జరుగుతాయన్నారు. కాగా జనవరి 29న ప్రారంభమైన ఎన్నికల కోడ్‌ మంగళవారం వరకూ కొనసాగింది.

Updated Date - Mar 05 , 2025 | 12:57 AM