Share News

గిరిజనుల అభివృద్ధి కోసం శ్రమించే నేత చంద్రబాబు

ABN , Publish Date - Feb 12 , 2025 | 12:36 AM

గిరిజనుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించే నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆర్టీసీ విజయనగరం జోన్‌ రీజనల్‌ చైర్మన్‌ సివేరి దొన్నుదొర అన్నారు. చింతలపూడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

గిరిజనుల అభివృద్ధి కోసం శ్రమించే నేత చంద్రబాబు
విలేకరులతో మాట్లాడుతున్న సీవేరి దొన్నుదొర

- రాజకీయ లబ్ధికి వైసీపీ డ్రామాలు

- ఆర్టీసీ విజయనగరం జోన్‌ రీజనల్‌ చైర్మన్‌ సివేరి దొన్నుదొర

అనంతగిరి, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించే నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆర్టీసీ విజయనగరం జోన్‌ రీజనల్‌ చైర్మన్‌ సివేరి దొన్నుదొర అన్నారు. చింతలపూడిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ లబ్ధికోసమే 1/70 చట్టాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. గిరిజనులకు అన్యాయం చేసే పనిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ తలపెట్టరని స్పష్టం చేశారు. ప్రపంచస్థాయిలో అరకు కాఫీకి గుర్తింపు తీసుకువచ్చింది చంద్రబాబేనని గుర్తుచేశారు. గత వైసీపీ ప్రభుత్వం జీవో నంబరు 3పై రివ్యూ పిటిషన్‌ కూడా వేయలేదని, ఈ సమస్యను నారా లోకేశ్‌ దృష్టికి తీసుకువెళితే ఆ జీవో పునరుద్ధరించి న్యాయం జరిగేలా కేంద్రం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారని చెప్పారు. దీనిపై ప్రజా సంఘాల నాయకులకు ఆలోచించాలని, 1/70 చట్టంపై తప్పుడు ఆరోపణలను నమ్మవద్దని, సాటి గిరిజనుడిగా తాను చెబుతున్నానని ఆయన అన్నారు.

Updated Date - Feb 12 , 2025 | 12:36 AM