పెంటకోట తీరంలో తాబేళ్ల కళేబరాలు
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:45 PM
మండలంలోని పెంటకోట సముద్ర తీరానికి తాబేళ్ల కళేబరాలు కొట్టుకు వచ్చాయి. వీటిని చూసి మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పరిశ్రమల కాలుష్యమే కారణమని మత్స్యకారులు ఆరోపణ
పాయకరావుపేట రూరల్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెంటకోట సముద్ర తీరానికి తాబేళ్ల కళేబరాలు కొట్టుకు వచ్చాయి. వీటిని చూసి మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న రసాయన పరిశ్రమలు విడుదల చేసే కాలుష్య వ్యర్థాల కారణంగానే తాబేళ్లు మృతిచెందుతున్నాయని వారు ఆరోపించారు. సముద్రంలో ఇప్పటికే మత్స్య సంపద తగ్గిపోయి తాము జీవనోపాధి కోల్పోతున్నామని పెంటకోట, వెంకటనగరం, రాజవరం, పాల్మన్‌పేట, రత్నయ్యమ్మపేట తదితర గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీర ప్రాంతంలో ఉన్న రొయ్యల హేచరీలు, ఫార్మా కంపెనీలు రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా గెడ్డలు, వాగుల ద్వారా సముద్రంలోకి వదిలేయడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. 15 రోజుల కిందట రత్నయ్యమ్మపేట సముద్ర తీరంలో కూడా పెద్ద సంఖ్యలో తాబేళ్ల కళేబరాలు కనిపించినట్టు మత్స్యకారులు తెలిపారు.