Share News

బ్రాండిక్స్‌ ఉద్యోగులు ఆందోళన

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:00 AM

ప్రత్యేక ఆర్థిక మండలిలోని బాండ్రిక్స్‌ బ్రాండిక్స్‌ (అధిస్థాన్‌ సమీకృత పారిశ్రామిక పార్కు) కంపెనీ యాజమాన్యం పని గంటలు పెంచినందుకు నిరసనగా ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. కంపెనీలో ఇంతవరకు ఉద్యోగులకు ఎనిమిది గంటల పనివిధానం అమల్లో వుంది.

బ్రాండిక్స్‌ ఉద్యోగులు ఆందోళన
బ్రాండిక్స్‌ కంపెనీ మెయిన్‌ గేటు ముందు ఆందోళన చేస్తున్న ఉద్యోగులు

విధులు బహిష్కరించి మెయిన్‌ గేటు ఎదుట బైఠాయింపు

రోజుకు అర్ధ గంటపాటు పని వేళలు పెంచిన యాజమాన్యం

శాశ ్వత ఉద్యోగులకు రూ.1,000, ఇతరులకు రూ.700 పెంపు

అంగీకరించని ఉద్యోగులు

అచ్యుతాపురం, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక ఆర్థిక మండలిలోని బాండ్రిక్స్‌ బ్రాండిక్స్‌ (అధిస్థాన్‌ సమీకృత పారిశ్రామిక పార్కు) కంపెనీ యాజమాన్యం పని గంటలు పెంచినందుకు నిరసనగా ఉద్యోగులు గురువారం విధులు బహిష్కరించి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. కంపెనీలో ఇంతవరకు ఉద్యోగులకు ఎనిమిది గంటల పనివిధానం అమల్లో వుంది. మధ్యలో 30 నిమిషాలు భోజన విరామం వుంది. అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అరగంట అదనంగా విధులు నిర్వహించాలని, ఇందుకుగాను శాశ్వత ఉద్యోగులకు నెలకు రూ.1,000, ఇతరులకు రూ.700 అదనంగా చెల్లిస్తామని యాజమాన్యం తెలిపింది. ఇందుకు ఉద్యోగులు అంగీకరించలేదు. ఎప్పటి మాదిరిగానే ఎనిమిది గంటలే పనిచేస్తామని స్పష్టం చేశారు. యాజమాన్య తీరును నిరసిస్తూ గురువారం మధ్యాహ్నం రెండో షిఫ్ట్‌కి వచ్చిన ఉద్యోగులతోపాటు, మొదటి షిఫ్ట్‌లో విధులు నిర్వహించి బయటకు వచ్చిన ఉద్యోగులు కలిసి ఆందోళనకు దిగారు. ఆదివారం కూడా విధులకు రావాలంటూ యాజమాన్యం హుకుం జారీ చేస్తున్నదని ఆరోపించారు. అరకొర జీతాలు ఇస్తూ టార్గెట్లు పెట్టి వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఉద్యోగులు మండి పడ్దారు. కాగా ఉద్యోగులతో ఆందోళనను విరమింపజేయడానికి యాజమాన్య ప్రతినిధులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

Updated Date - Jan 31 , 2025 | 01:00 AM