ఏపీ టూరిజం కార్మికుల నిరసన
ABN , Publish Date - Feb 16 , 2025 | 12:51 AM
జీతాలు చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుషికొండలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు శనివారం నిరసన చేపట్టారు. రుషికొండ బీచ్‌లో పరిచేసే పారిశుధ్య కార్మికులు, లైఫ్ గార్డులు, సెక్యూరిటీ గార్డులతో పాటు వివిధ పనులు చేసే 38 మంది కార్మికులు ఆందోళనకు దిగారు.
సాగర్‌నగర్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): జీతాలు చెల్లించాలంటూ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రుషికొండలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు శనివారం నిరసన చేపట్టారు. రుషికొండ బీచ్‌లో పరిచేసే పారిశుధ్య కార్మికులు, లైఫ్ గార్డులు, సెక్యూరిటీ గార్డులతో పాటు వివిధ పనులు చేసే 38 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. నవంబరు నెల నుంచి జాతాలు చెల్లించకపోవడంతో తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వారు బ్లూ ఫ్లాగ్ బీచ్ మేనేజర్ సతీశ్‌కు వినతిపత్రాన్ని అందజేసారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి రెండు మూడు రోజుల్లో జీతాలు అందేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు.