జ్యోతి ఖాతాలో మరో స్వర్ణం
ABN , Publish Date - Feb 12 , 2025 | 12:50 AM
నగరానికి చెందిన అంతర్జాతీయ స్టార్ స్పింటర్ ఎర్రాజీ జ్యోతి ఖాతాలో మరో పసిడి పతకం జమయింది.

200 మీటర్ల పరుగులో రికార్డు
విశాఖపట్నం స్పోర్ట్సు, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):
నగరానికి చెందిన అంతర్జాతీయ స్టార్ స్పింటర్ ఎర్రాజీ జ్యోతి ఖాతాలో మరో పసిడి పతకం జమయింది. డెహ్రాడూన్‌లో మంగళవారం జరిగిన మహిళల 200 మీ. పరుగులో స్వర్ణ పతకం సాధించింది. హీట్స్‌లో 23.85 సెకన్లతో ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన జ్యోతి...పైనల్ రేస్‌ను 23.53 సెకన్లలో పూర్తిచేసింది. దీంతో జాతీయ క్రీడల్లో ఆంధ్రాకు రెండు స్వర్ణ పతకాలు అందిం చింది. ఆమె విజయం అభినందనీయమని జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డి.నాగేశ్వరరావు, ఎం.నారాయణరావు పేర్కొన్నారు. జ్యోతిని ఒలింపిక్ సంఘం చైర్మన్ గణబాబు, అధ్యక్ష, కార్యదర్శులు ప్రసన్నకుమార్, కంచరాన సూర్యనారాయణ, మోహన్ వెంకటరామ్ అభినందించారు. జాతీయ క్రీడల్లో ఇప్పటివరకు ఆంధ్రకు ఐదు స్వర్ణ పతకాలు రాగా... విశాఖకు చెందిన క్రీడాకారులు అథ్లెటిక్స్‌లో ఎర్రాజి జ్యోతి రెండు, బీచ్ వాలీబాల్‌లో మణికంఠరాజు-దివ్యసాయి ఒక స్వర్ణం అందించారు.
------------------------------------------------------------------------------
జేఈఈ మెయిన్స్‌లో మెరిశారు
డాబాగార్డెన్స్, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి):
ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాలకు సంబంధించి గత నెలలో నిర్వహించిన జేఈఈ సెక్షన్ 1 పరీక్షల్లో విశాఖ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో విశాఖకు చెందిన బి.విక్రమ్‌రాజ్ 99.997, డీబీఎస్‌బీ ప్రసాద్ 99.994, హరిచరణ్ 99.98 పర్సంటైల్ సాధించారు. కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీ విద్యార్థులు 90.0 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించారు. సెక్షన్ 2 పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. రెండింటిలో ఉత్తమ పర్సంటైల్‌ను తీసుకొని జాతీయస్థాయి ర్యాంకులను ఖరారు చేస్తారు.