Share News

అనకాపల్లి చెత్తమయం

ABN , Publish Date - Jan 16 , 2025 | 01:36 AM

పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారం పేరుకుపోయింది. కనుమ పండుగ సందర్భంగా మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులకు బుధవారం సెలవు కావడంతో పట్టణంలో చెత్త సేకరించలేదు.

అనకాపల్లి చెత్తమయం

కనుమ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు సెలవు

వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం

అనకాపల్లి టౌన్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి):

పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త, చెదారం పేరుకుపోయింది. కనుమ పండుగ సందర్భంగా మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులకు బుధవారం సెలవు కావడంతో పట్టణంలో చెత్త సేకరించలేదు. దీంతో డంపర్‌ బిన్‌లు నిండిపోవడంతో వాటి పక్కనే చెత్త చెల్లాచెదురుగా పడివుంది. వీటి వద్ద కుక్కలు, పందులు విహరిస్తుండడంతో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. సంక్రాంతి పండుగ రోజు ఇళ్ల నుంచి వ్యర్థాలు అధికంగా రావడం, బుధవారం పారిశుధ్య కార్మికులకు సెలవు కావడంతో ప్రజల్లో ఇళ్లల్లోని చెత్తను తీసుకువచ్చి డస్ట్‌బిన్లు వద్ద పడేశారు. గురువారం ఉదయానికి చెత్తాచెదారం మరింత పెరిగే అవకాశం వుంది. చెత్త పేరుకుపోయిన విషయమై జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ బీవీ రమణను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా.. పట్టణంలోని అన్ని పాంతాల్లో గురువారం మధ్యాహ్నంకల్లా చెత్తను సేకరించి విశాఖలోని డంపింగ్‌యార్డుకు తరలిస్తామని చెప్పారు.

Updated Date - Jan 16 , 2025 | 01:36 AM