అభిషేక్ సేవలు అభినందనీయం
ABN , Publish Date - Feb 07 , 2025 | 10:08 PM
స్థానిక ఐటీడీఏలో పీవోగా పనిచేసి పోలవరం ప్రాజెక్టు అడ్మిస్ట్రేటర్‌గా బదిలీ అయిన వి.అభిషేక్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.

వీడ్కోలు సభలో కలెక్టర్ దినేశ్‌కుమార్
పాడేరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఐటీడీఏ పీవోగా పనిచేసి పోలవరం ప్రాజెక్టు అడ్మిస్ట్రేటర్‌గా బదిలీ అయిన వి.అభిషేక్ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అభిషేక్ ఆత్మీయ వీడ్కోలు సభలో కలెక్టర్ ముఖ్యఅతిఽథిగా పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో సేవలందించడం కష్టతరమైనదని, రాష్ట్రంలోనే పెద్ద ఐటీడీఏ అయిన పాడేరులో అనేక సమస్యలను పరిష్కరిస్తూ అభిషేక్ విధులు నిర్వహించారన్నారు. వరదలు, తుఫాన్ల సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించారని కొనియాడారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రజల కలని, అది అభిషేక్ హయాంలో నెరవేరుతుందన్నారు. పూర్వపు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గిరిజనుల అభివృద్థి, సంక్షేమానికి ఎంతో కృషిచేశానన్నారు. ఈ సందర్భంగా అభిషేక్‌కు గజమాల వేసి, శాలువాలు కప్పి కలెక్టర్ దినేశ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్‌గౌడ, డీఎఫ్‌వో పీవీ.సందీప్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ శార్యమన్ పటేల్, అధికారులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్వో కె.పద్మలత, ఐటీడీఏ ఏపీవోలు వీఎస్.ప్రభాకరరావు, ఎం.వెంకటేశ్వరరావు, ఏవో ఎం.హేమలత, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నంద్, మైక్రో ఇరిగేషన్ పీడీ రహీమ్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ జి.డేవిడ్‌రాజు, టీడబ్ల్యూ డీడీ ఎల్.రజని, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.