ఎన్‌టీఆర్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:00 PM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 29వ వర్ధంతిని శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు.

వాడవాడలా వర్ధంతి వేడుకలు
పాల్గొన్న కిడారి శ్రావణ్‌కుమార్,
శిరీషాదేవి, గిడ్డి ఈశ్వరి, దొన్నుదొర
పాడేరు, జనవరి 18 (ఆంధ్ర జ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 29వ వర్ధంతిని శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. పాడేరులోని ఎన్‌టీఆర్ విగ్రహానికి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అరకులోయలో ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే రంపచోడవరంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఎన్‌టీఆర్ విగ్రహానికి మాలలు వేసి నివాళులర్పించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా నియోజవర్గం, మండల, పంచాయతీ, గ్రామ స్థాయిల్లోనూ టీడీపీ శ్రేణులు ఎన్‌టీఆర్ అభిమానులు ఆయన వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
రాజకీయ చైతన్యానికి ప్రతీక ఎన్‌టీఆర్: కిడారి
తెలుగు ప్రజలను రాజకీయంగా చైతన్యం చేసింది ఎన్‌టీఆర్ మాత్రమేనని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలిసి స్థానిక పాతబస్టాండ్ వద్ద ఎన్‌టీఆర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ తెలుగు వాడి కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, మాజీ ఎంపీపీలు ఎస్వీ.రమణమూర్తి, బొర్రా విజయరాణి, టీడీపీ నేతలు పాండురంగస్వామి, సాగరసుబ్బారావు, కూడా భూషణరావు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎన్‌టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.