Share News

గంజాయి రవాణాపై ఉక్కుపాదం

ABN , Publish Date - Jan 25 , 2025 | 11:21 PM

గంజాయి, గో మాంసం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, హైవే జంక్షన్లలో అనుమానాస్పదంగా వున్న అన్ని వాహనాలను నిశితంగా పరిశీలించాలని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదేశించారు.

గంజాయి రవాణాపై ఉక్కుపాదం
సీఐ, ఎస్‌ఐలకు సూచనలు ఇస్తున్న డీఎస్పీ పి.శ్రీనివాసరావు

గో మాంసం అక్రమ తరలింపుపై కూడా..

నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు

నక్కపల్లి పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

అధికారులకు పలు సూచనలు

నక్కపల్లి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): గంజాయి, గో మాంసం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, హైవే జంక్షన్లలో అనుమానాస్పదంగా వున్న అన్ని వాహనాలను నిశితంగా పరిశీలించాలని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం సాయంత్రం నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఐ కుమారస్వామి, ఎస్‌ఐ సన్నిబాబుతో మాట్లాడారు. పెండింగ్‌ కేసుల గురించి ఆరా తీశారు. ఇటీవల వేంపాడులో కంటైనర్‌ లారీతో వెళుతున్న గోమాంసాన్ని పట్టుకున్న విషయమై ఆరా తీశారు. గంజాయి రవాణా చేసేవారు కూడా పలు రకాలుగా వ్యవహరిస్తున్నారని, ఇటీవల మీడియా ముసుగులో స్టిక్కర్లను వాహనాలకు అంటించి తరలిస్తుండగా నర్సీపట్నంలో పోలీసులు ఛేదించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రమాదాల నివారణకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నామని సీఐ కుమారస్వామి చెప్పారు.

Updated Date - Jan 25 , 2025 | 11:21 PM