Share News

75 శాతం హాజరు ఉండాల్సిందే

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:42 AM

ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు 75 శాతం హాజరు విధిగా ఉండాల్సిందేనని బోర్డు నిర్దేశించింది. అంతకంటే తక్కువ ఉంటే ఫైన్‌ చెల్లించాలి. అది కూడా 60 శాతం హాజరు వరకు మాత్రమే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 75 శాతానికి పది రోజులు తక్కువైతే రూ.వెయ్యి, 15 రోజులు తక్కువైతే రూ.1,500, 15 రోజులకు మించి 60 శాతం వరకు రూ.2 వేలు అపరాధ రుసుము చెల్లిస్తేనే హాల్‌టికెట్లు పంపిణీ చేస్తారు. మార్చి 1 నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు పొందుపరిచేలోగా హాజరు తక్కువున్న విద్యార్థులు ఫైన్‌ చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు.

75 శాతం హాజరు ఉండాల్సిందే

తక్కువైతే ఇంటర్‌ పరీక్షలకు నో!

60 శాతం వరకు ఫైన్‌తో వెసులుబాటు

మద్దిలపాలెం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు 75 శాతం హాజరు విధిగా ఉండాల్సిందేనని బోర్డు నిర్దేశించింది. అంతకంటే తక్కువ ఉంటే ఫైన్‌ చెల్లించాలి. అది కూడా 60 శాతం హాజరు వరకు మాత్రమే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 75 శాతానికి పది రోజులు తక్కువైతే రూ.వెయ్యి, 15 రోజులు తక్కువైతే రూ.1,500, 15 రోజులకు మించి 60 శాతం వరకు రూ.2 వేలు అపరాధ రుసుము చెల్లిస్తేనే హాల్‌టికెట్లు పంపిణీ చేస్తారు. మార్చి 1 నుంచి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు పొందుపరిచేలోగా హాజరు తక్కువున్న విద్యార్థులు ఫైన్‌ చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:42 AM