Share News

గిరిజన కాఫీ రైతులకు రూ.50 లక్షలు బోనస్‌

ABN , Publish Date - Jan 30 , 2025 | 11:27 PM

చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌కు కాఫీ పండ్లు విక్రయించిన గిరిజన రైతులకు రూ.50 లక్షల మేర బోనస్‌ చెల్లిస్తున్నామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ తెలిపారు.

గిరిజన కాఫీ రైతులకు రూ.50 లక్షలు బోనస్‌
చింతపల్లి మ్యాక్స్‌ యాజమాన్యంతో సమావేశమైన ఐటీడీఏ పీవో అభిషేక్‌

ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌

పాడేరు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): చింతపల్లి ఎకో పల్పింగ్‌ యూనిట్‌కు కాఫీ పండ్లు విక్రయించిన గిరిజన రైతులకు రూ.50 లక్షల మేర బోనస్‌ చెల్లిస్తున్నామని ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌ తెలిపారు. తన కార్యాలయంలో మ్యాక్స్‌ సంస్థ ప్రెసిడెంట్‌, సెక్రటరీ, డైరెక్టర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాఫీ పండ్లను రైతులకు కిలోకు రూ.44 చొప్పున చెల్లించామని, అదనంగా మరో రూ.8 బోనస్‌గా చెల్లిస్తున్నామన్నారు. గతేడాది చెల్లించిన బోనస్‌ కంటే రెట్టింపు బోనస్‌ను రైతులకు అందిస్తున్నామన్నారు. అలాగే మ్యాక్స్‌ ద్వారా ఇప్పటి వరకు 621 టన్నుల పార్చిమెంట్‌ కాఫీని ఐటీసీకి విక్రయించామని, ప్రతి రైతుకు బోనస్‌ను పారదర్శకంగా చెల్లిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవోలు వీఎస్‌ ప్రభాకరరావు, ఎం.వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అప్పలనాయుడు, చింతపల్లి మ్యాక్స్‌ అధ్యక్ష,కార్యదర్శులు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2025 | 11:27 PM