Share News

32 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Jan 07 , 2025 | 11:42 PM

మండల పరిధి జీఎం కొత్తూరు కూడలిలో 32 కిలోల గంజాయితో ఇద్దరిని అరెస్టు చేసినట్టు స్థానిక సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.

32 కిలోల గంజాయి స్వాధీనం
పట్టుబడిన గంజాయి, నిందితులతో పోలీసులు

భార్యాభర్తల అరెస్టు

జి.మాడుగుల, జనవరి 7(ఆంధ్రజ్యోతి) : మండల పరిధి జీఎం కొత్తూరు కూడలిలో 32 కిలోల గంజాయితో ఇద్దరిని అరెస్టు చేసినట్టు స్థానిక సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మంగళవారం జీఎం కొత్తూరు కూడలిలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పెదబయలు మండలం వెల్లపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కిలో సుబ్బారావు, జ్యోతి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆపి సోదా చేశారు. వారి వద్ద 32 కిలోల గంజాయి లభ్యం కావడంతో స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Jan 07 , 2025 | 11:42 PM