205 కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Jan 25 , 2025 | 12:10 AM
ఏజెన్సీ వైపు నుంచి మైదాన ప్రాంతం మీదుగా 205 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చింతపల్లి వైపు నుంచి నర్సీపట్నం వైపు గంజాయి రవాణా అవుతున్నట్టు శుక్రవారం ఉదయం నర్సీపట్నం రూరల్ పోలీసులకు సమాచారం వచ్చిందని చెప్పారు. దీంతో నర్సీపట్నం శివారులో వాహనాల తనిఖీ చేపట్టారని, ఈ క్రమంలో ఒక టీవీ న్యూస్ ఛానెల్ (ఏబీన్ ఆంధ్రజ్యోతి కాదు) స్టిక్కర్‌తో ఉన్న కారు, దాని వెనుక వస్తున్న మోటార్ బైక్‌ను పోలీసులు ఆపారని చెప్పారు. దీంతో వాహనాల్లో వున్న ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి పారిపోవడానికి యత్నించగా పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు.

ముగ్గురు నిందితుల అరెస్టు
అనకాపల్లి రూరల్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ వైపు నుంచి మైదాన ప్రాంతం మీదుగా 205 కిలోల గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ తుహిన్‌సిన్హా తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చింతపల్లి వైపు నుంచి నర్సీపట్నం వైపు గంజాయి రవాణా అవుతున్నట్టు శుక్రవారం ఉదయం నర్సీపట్నం రూరల్ పోలీసులకు సమాచారం వచ్చిందని చెప్పారు. దీంతో నర్సీపట్నం శివారులో వాహనాల తనిఖీ చేపట్టారని, ఈ క్రమంలో ఒక టీవీ న్యూస్ ఛానెల్ (ఏబీన్ ఆంధ్రజ్యోతి కాదు) స్టిక్కర్‌తో ఉన్న కారు, దాని వెనుక వస్తున్న మోటార్ బైక్‌ను పోలీసులు ఆపారని చెప్పారు. దీంతో వాహనాల్లో వున్న ముగ్గురు వ్యక్తులు కిందకు దిగి పారిపోవడానికి యత్నించగా పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు. కేరళకు చెందిన అజిత్ కంగ్‌రాజన్, అమల్‌సురేశ్, అల్లూరి జిల్లాకు చెందిన మర్రి సత్తిబాబులను అదుపులోకి తీసుకున్నారని, కారులో తనిఖీ చేయగా 205 కిలోల గంజాయి లభించిందన్నారు. దీంతోపాటు రూ.1,500 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామన్నారు. నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలతోపాటు నగదు రివార్డును అందజేశారు.