Share News

స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో జిల్లాకు 12వ ర్యాంకు

ABN , Publish Date - Feb 15 , 2025 | 12:55 AM

స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో భాగంగా పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలు చేపట్టిన కార్యక్రమాలపై 14 సూచీల ఆధారంగా కూటమి ప్రభుత్వం శుక్రవారం జిల్లాలకు రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో అనకాపల్లి జిల్లాకు 12వ స్థానం దక్కింది.

స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో జిల్లాకు 12వ ర్యాంకు

అనకాపల్లి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో భాగంగా పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలు చేపట్టిన కార్యక్రమాలపై 14 సూచీల ఆధారంగా కూటమి ప్రభుత్వం శుక్రవారం జిల్లాలకు రాష్ట్రస్థాయి ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో అనకాపల్లి జిల్లాకు 12వ స్థానం దక్కింది. పట్ణణాభివృద్ధి శాఖ పరిధిలో డోర్‌ టు డోర్‌ కలెక్షన్‌కు 15 పాయింట్లు, సోర్స్‌ సెగ్రిగేషన్‌కు 35 పాయింట్లు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు 20 పాయింట్లు, లెగసీ వేస్ట్‌ క్లీయరెన్స్‌కు 10 పాయింట్లు, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు 20 పాయింట్లు, పంచాయతీరాజ్‌ శాఖ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణకు 15 పాయింట్లు, పబ్లిక్‌ టాయిలెట్స్‌కు 10 పాయింట్లు, కమ్యూనిటీ సోక్‌ పిట్స్‌కు 10 పాయింట్లు, నూరు శాతం డోర్‌ టు డోర్‌ చెత్త కలెక్షన్‌కు 10 పాయింట్లు, ఓడీఎఫ్‌ ప్లస్‌ మోడల్‌కు 20 పాయింట్లు చొప్పున మొత్తం 200 పాయింట్ల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు కేటాయించింది. రాష్టస్థాయిలో అనకాపల్లి జిల్లాకు 113 పాయింట్లు దక్కడంతో 12వ స్థానంలో నిలిచింది.

Updated Date - Feb 15 , 2025 | 12:55 AM