Share News

Visakhapatnam Yoga Event: గిన్నిస్‌ లక్ష్యంగా విశాఖలో యోగా వేడుకలు

ABN , Publish Date - May 31 , 2025 | 05:35 AM

విశాఖపట్నంలో జూన్ 21న 5 లక్షల మంది ఆసనాలు వేయడం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాలో ఒక సోలార్ రూఫ్‌టాప్ మోడల్ విలేజ్ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

Visakhapatnam Yoga Event: గిన్నిస్‌ లక్ష్యంగా విశాఖలో యోగా వేడుకలు

5 లక్షల మంది పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు: సీఎస్‌

అమరావతి, మే 30(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో జూన్‌ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో 5 లక్షల మందితో ఆసనాలు వేయించడం ద్వారా గిన్నిస్‌ రికార్డు సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ పేర్కొన్నారు. యోగాంధ్ర-2025, యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం ఆయా శాఖల కార్యదర్శులతో సమీక్షించారు. సీఎస్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కనీసం 2 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌ నుంచి భీమిలి వరకూ సుమారు 26 కిలోమీటర్ల పొడవున నిర్వహించే కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొని, ప్రపంచ గిన్నిస్‌ రికార్డు సాధించేలా, సమీప భవిష్యత్తులో ఎవరూ ఆ రికార్డును అధిగమించలేని రీతిలో విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రస్థాయి నోడల్‌ అధికారి కృష్ణబాబు జూన్‌ 16 నుంచి విశాఖ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంగా పని చేస్తారన్నారు. సమావేశంలో డీజీపీ హరీ్‌షకుమార్‌ గుప్తా వర్చువల్‌గా పాల్గొన్నారు.


ప్రతి జిల్లాలో సోలార్‌ రూఫ్‌టాప్‌ మోడల్‌ విలేజ్‌: సీఎస్‌

ప్రతి జిల్లాలోనూ ఒక సోలార్‌ రూఫ్‌టాప్‌ మోడల్‌ విలేజ్‌ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌ నాటికి డిస్కమ్‌లు, నెడ్‌క్యాప్‌ కలిపి మూడు లక్షల సోలార్‌ రూఫ్‌టాప్‌ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం డిస్కమ్‌ల సీఎండీలు, నెడ్‌క్యాప్‌ అధికారులతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ ఏడాది 20 లక్షల రూఫ్‌టాప్‌ సోలార్‌ కనెక్షన్లు ఇవ్వాలన్నదే లక్ష్యమని సీఎస్‌ చెప్పారు.


ఇవి కూడా చదవండి

ప్రజలతో మమేకమవ్వండి.. నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

ఫేస్‌బుక్ పరిచయం.. యువతికి లంచ్ ఆఫర్.. చివరకు

Read Latest AP News And Telugu News

Updated Date - May 31 , 2025 | 05:35 AM