IT company Control-A: విశాఖకు మరో గ్లోబల్ డేటా సెంటర్
ABN , Publish Date - Dec 04 , 2025 | 04:34 AM
రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్ ప్రతిపాదన..
అమరావతి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖపట్నం డేటా సెంటర్లకు కేంద్రంగా మారుతోంది. గూగుల్ డేటా సెంటర్ ప్రతిపాదన.. మరిన్ని గ్లోబల్ సంస్థలు విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు దారి చూపుతోంది. తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ కంట్రోల్-ఎస్ విశాఖలో 350 మెగావాట్ల డేటా సెంటర్ స్థాపించేందుకు ముందుకొచ్చింది. విశాఖలో డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పలు కంపెనీలు ప్రతిపాదనలను సమర్పించాయి. వీటిని పరిశీలించిన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. విశాఖలో రెవెన్యూ అధికారులతో కలసి ప్రతిపాదిత భూములను పరిశీలించాలని వాటికి సూచించింది.
బుధవారం నాడు విశాఖలో రెవెన్యూ అధికారులతో కలసి కంట్రోల్-ఎస్ సంస్థ ప్రతినిధులు భూములను పరిశీలించారు. అలాగే గ్లోబల్ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన ఓ దేశీయ సంస్థ ప్రతినిధులు, మరో ప్రఖ్యాత సంస్థ ప్రతినిధులు కూడా విశాఖలో భూములు పరిశీలించారు. ఈ భూముల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ సానుకూల ప్రతిపాదనలు ఇస్తే.. వాటిని ఎస్‌ఐపీసీ, ఎస్‌ఐపీబీ, ఆ తర్వాత ఈ నెల 25న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నారు. ఈ మూడు డేటా సెంటర్లు విశాఖలోనే ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉండటంతో.. ఉత్తరాంధ్రలోని సముద్ర తీర ప్రాంతం డేటా సెంటర్లతో నిండిపోనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Alcohol Sale: 8 నెలలు.. 20వేల కోట్లు
MLA Kotamreddy Sridhar Reddy: పెంచలయ్య కుటుంబానికి రూ.10 లక్షల సాయం