Share News

Fertilizer Shops: ఎరువుల షాపులపై విజిలెన్స్‌ దాడులు

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:56 AM

రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖతోపాటు..

Fertilizer Shops: ఎరువుల షాపులపై విజిలెన్స్‌ దాడులు

అమరావతి, జూలై16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖతోపాటు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు రెండు రోజులుగా దాడులు నిర్వహించాయి. 624 రిటైల్‌, 104 హోల్‌సేల్‌, 30తయారీ కంపెనీల్లో తనిఖీలు జరిపారు. రూ.40.31కోట్ల విలువైన 159.42 క్వింటాళ్ల విత్తనాలు, 9,502 టన్నుల ఎరువులు, 1,79,636లీటర్ల పురుగు మందు స్వాధీనం చేసుకున్నారు. రూ.33.16లక్షల విలువైన 77.54టన్నుల ఎరువులు, 1,858లీటర్ల పురుగు మందు సీజ్‌ చేశారు. ఇద్దరు ఎరువుల డీలర్లు, ఇద్దరు పురుగు మందుల డీలర్ల లైసెన్సులు సస్పెండ్‌ చేశారు. నలుగురు విత్తన వ్యాపారులు, ఇద్దరు ఎరువుల డీలర్ల లైసెన్సులు రద్దు చేశారు. ఎరువుల డీలర్లపై ఐదు కేసులు నమోదు చేశారు.

Updated Date - Jul 17 , 2025 | 04:56 AM