Vice Chancellor Appointment: నాలుగు యూనివర్సిటీలకు మళ్లీ సెర్చ్ కమిటీలు
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:48 AM
నాలుగు యూనివర్సిటీల్లో వైస్ చాన్స్‌లర్ల నియామకానికి ఉన్నత విద్యాశాఖ మళ్లీ సెర్చ్ కమిటీలను నియమించింది. ఆచార్య నాగార్జున, జేఎన్‌టీయూ-విజయనగరం, ద్రవిడియన్, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలకు...
రెండు నెలల్లో వీసీల నియామకానికి చర్యలు
అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): నాలుగు యూనివర్సిటీల్లో వైస్ చాన్స్‌లర్ల నియామకానికి ఉన్నత విద్యాశాఖ మళ్లీ సెర్చ్ కమిటీలను నియమించింది. ఆచార్య నాగార్జున, జేఎన్‌టీయూ-విజయనగరం, ద్రవిడియన్, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలకు సెర్చ్ కమిటీలు నియమిస్తూ ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులిచ్చారు. రెండు నెలల్లో కొత్త వీసీలను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా తొమ్మిది యూనివర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్నిటికీ రెండు నెలల్లో కొత్త వీసీలను నియమించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.