Share News

AP Veterinary JAC: న్యాయం చేయాలని కోరితే చెయ్యెత్తుతారా

ABN , Publish Date - Jun 13 , 2025 | 06:10 AM

పశుసంవర్ధకశాఖ బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందని చెప్పుకోవటానికి వచ్చిన వెటర్నరీ డాక్టర్‌పై ఆశాఖ డైరెక్టర్‌ చెయ్యెత్తి, దురుసుగా ప్రవర్తించడాన్ని ఏపీ వెటర్నరీ గెజిటెడ్‌ ఆఫీసర్‌...

AP Veterinary JAC: న్యాయం చేయాలని కోరితే చెయ్యెత్తుతారా

  • వెటర్నరీ డైరెక్టర్‌ తీరుపై జేఏసీ ఆగ్రహం

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): పశుసంవర్ధకశాఖ బదిలీల్లో తమకు అన్యాయం జరిగిందని చెప్పుకోవటానికి వచ్చిన వెటర్నరీ డాక్టర్‌పై ఆశాఖ డైరెక్టర్‌ చెయ్యెత్తి, దురుసుగా ప్రవర్తించడాన్ని ఏపీ వెటర్నరీ గెజిటెడ్‌ ఆఫీసర్‌ జేఏసీ, రాష్ట్ర పశుసంవర్ధకశాఖ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించాయి. విశాఖకు చెందిన భార్యాభర్తలైన పశువైద్యులు.. ఐదేళ్లు పూర్తి కాకపోయినా తమను బదిలీ చేశారని, విజయవాడలోని డైరెక్టరేట్‌కు వచ్చి డైరెక్టర్‌ దామోదర్‌నాయుడును కలిశారని తెలిపింది. తన భార్య డాక్టర్‌ పద్మలీలకు అన్యాయం చేశారంటూ ఆమె భర్త డాక్టర్‌ సురేష్‌ డైరెక్టర్‌ను గట్టిగా నిలదీశారని, ఈ సందర్భంగా డైరెక్టర్‌ దామోదర్‌నాయుడు ఆయనపై చేయి చేసుకోబోయారని జేఏసీ ఆరోపించింది. అన్యాయం జరిగితే అడగటం తప్పన్నట్లు మాట్లాడి, ప్రభుత్వాన్ని అడుక్కోపో అంటూ దురుసుగా మాట్లాడారని మండిపడింది. డైరెక్టర్‌ తీరుపై ప్రిన్సిపల్‌ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని జేఏసీ చైర్మన్‌ కృష్ణారావు తెలిపారు.

Updated Date - Jun 13 , 2025 | 06:18 AM