Amaravati: అమరావతి అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:16 AM
అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ తెలియజేశారు.
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ వెల్లడి
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): అమరావతి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని మంత్రి నారాయణకు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ తెలియజేశారు. మంత్రి నారాయణతో బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణం, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను యూకే ప్రతినిధులకు మంత్రి వివరించారు. అమరావతి ఆర్థికంగా వృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని వెల్లడించారు. అమరావతిలో ఐకానిక్ భవనాల డిజైన్లు బ్రిటన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ రూపొందించారని తెలిపారు. దీంతో అమరావతి అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఓవెన్ చెప్పారు. ప్రధానంగా డిజైన్, ఇంజనీరింగ్ సేవల్లో కలిసి పనిచేసేందుకు బ్రిటన్ మౌలికవసతుల నిపుణుల బృందం ఆసక్తి చూపించింది. సీఎం చంద్రబాబు మంచి విజన్ ఉన్న నాయకుడని యూకే ప్రతినిధులు కొనియాడారు.