TTD: భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 05:33 AM
ఎన్‌ఆర్‌ఐ భక్తులకు శ్రీవారి దర్శన టికెట్లు ఆశజూపి నగదు వసూలు చేస్తున్నట్టు ఎన్‌ఆర్‌ఐ భక్తుడు గోపాల్‌రాజ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరిక
తిరుమల, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు. ఎన్‌ఆర్‌ఐ భక్తులకు శ్రీవారి దర్శన టికెట్లు ఆశజూపి నగదు వసూలు చేస్తున్నట్టు ఎన్‌ఆర్‌ఐ భక్తుడు గోపాల్‌రాజ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రసాద్ అనే పేరుతో టీటీడీ పీఆర్వో అని చెప్పుకుంటూ, చైర్మన్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని...తిరుమల సమాచారం అనే గ్రూప్ ద్వారా ఈ తంతు జరుగుతున్నట్టు ఫిర్యాదు చేశారు. దీనిని బీఆర్ నాయుడు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. వింగ్ సిబ్బంది బాధితుడి నుంచి చేపట్టిన వివరాల ఆధారంగా నిందితుడు హైదరాబాదులోని ఓల్డ్ సిటీకి చెందిన మహ్మద్ జావేద్ ఖాన్‌గా గుర్తించారు. విజిలెన్స్ ఫిర్యాదుతో తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్‌ఆర్‌ఐ భక్తుల నుంచి దర్శనం పేరుతో భారీ మొత్తంలో వసూలు చేస్తూ, డబ్బు ముట్టాక వారిని గ్రూప్ నుంచి తొలగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Also Read: రిమాండ్ మళ్లీ పొడిగింపు.. విచారణలో నోరు విప్పని వంశీ
For National News And Telugu News