Share News

Nellore: ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి

ABN , Publish Date - Nov 02 , 2025 | 03:38 PM

నెల్లూరు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు నారాయణరెడ్డిపేటకి చెందిన వారిగా గుర్తించారు.

Nellore: ఏపీలో తీవ్ర విషాదం.. ముగ్గురు మృతి
Tragedy at Nellore Maipadu Beach

నెల్లూరు, నవంబర్ 2: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్‌లో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు నారాయణరెడ్డిపేటకి చెందిన వారిగా గుర్తించారు. సెలవు దినం కావడంతో ముగ్గురు స్నేహితులు బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న మెరైన్ పోలీసులు.. సముద్రంలో గాలించి మృతదేహాలని వెలికి తీశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి:

Kashi Bugga Temple Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

CM Chandrababu: లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబు దంపతులు

Updated Date - Nov 02 , 2025 | 03:38 PM