Tirumala srivani darshan: శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు భారీ డిమాండ్..
ABN , Publish Date - Aug 16 , 2025 | 10:06 AM
తిరుమలలో శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు భక్తుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. ఈ రోజు దర్శనం టికెట్ల కోసం ముందు రోజు నుంచే భక్తులు క్యూ లైన్ల వద్ద వేచి ఉన్నారు. కరెంటు బుకింగ్ కింద కేవల 800 టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. ఆ టిక్కెట్లోన్నీ గంట వ్యవధిలోనే పూర్తవుతున్నాయి.
తిరుమల (Tirumala)లో శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లకు భక్తుల నుంచి భారీ డిమాండ్ నెలకొంది. దర్శనం టికెట్ల కోసం ముందు రోజు నుంచే భక్తులు క్యూ లైన్ల వద్ద వేచి ఉంటున్నారు. కరెంటు బుకింగ్ కింద కేవల 800 టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తున్నారు. ఆ టిక్కెట్లన్నీ గంట వ్యవధిలోనే పూర్తవుతున్నాయి. దీంతో అప్పటికే క్యూ లైన్లో వేచి వున్న భక్తులు టికెట్ల కోసం ఆందోళనకు దిగుతున్నారు (Tirumala srivani darshan).
టికెట్ల కోసం నిరసనకు దిగ్గిన భక్తులకు సర్ది చెప్పలేక టీటీడీ సిబ్బంది అవస్థలు పడుతున్నారు. శ్రీవాణి టిక్కెట్లను శనివారం ఉదయం 10 గంటలకు టికెట్ల జారీ చేస్తామని టీటీడీ అధికారులు చెప్పారు. అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో శుక్రవారం రాత్రే టికెట్లను జారీ చేశారు. టికెట్లు దొరకని భక్తులు అన్నమయ్య భవనం ఎదుట నిరసనకు దిగారు.
తిరుమలలో ఆందోళనలు చేస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడంతో భక్తులు వెనక్కి తగ్గారు. టికెట్లకు వున్న డిమాండ్ నేపథ్యంలో శ్రీవాణి దర్శన టిక్కెట్ల కోటాను పెంచాలంటూ టీటీడీ చైర్మన్‌కు పలువురు భక్తులు విజ్ఞాపన పత్రాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. ఇతను మామూలు దొంగ కాదు.. తాళం కప్పను విడగొట్టడానికి ఎలాంటి ట్రిక్ వాడాడో చూడండి..
ఇన్ని తెలివితేటలు ఎక్కడివి స్వామి.. పాత బల్బును ఎలా మార్చేశారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..