Broken pond embankments: తెగిన చెరువుల కట్టలు.. భయాందోళనలో ప్రజలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 09:52 AM
శ్రీకాళహస్తి నియోజకవర్గం కె.వి.బిపురంలో పెను ప్రమాదం తప్పింది. కాసేపటిక్రితం రాయలచెరువు, కల్లాత్తురు చెరువులకు కట్టలు తెగటంతో ఊర్లమీదకు నీరు భారీగా వస్తోంది. ఒక్కసారిగా 10 అడుగుల కంటే ఎత్తు నీరు ఊర్ల మీదకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
తిరుపతి, నవంబర్ 6: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం కె.వి.బిపురంలో పెను ప్రమాదం తప్పింది. కాసేపటిక్రితం రాయలచెరువు, కల్లాత్తురు చెరువులకు కట్టలు తెగటంతో ఊర్లమీదకు నీరు భారీగా నీరు వచ్చి చేరింది. ఒక్కసారిగా 10 అడుగుల కంటే ఎత్తు నీరు ఊర్ల మీదకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రజలు వెంటనే అప్రమత్తం అవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇళ్లపైకి చేరుకున్న వారు తప్ప, చిన్న పిల్లలు, పెద్దల పరస్థితిపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇళ్లు నీట మునగటంతో పాతపాలెం గ్రామస్తులు పక్క గ్రామాలకు తలిపోయారు. ఒక్కసారిగా నీరు రావడంతో పంటపొలాలు మునిగిపోయాయి. గొర్రెలు, పశువులు నీటిలో కొట్టుకుపొయాయి. దీంతో రాయల్ చెరువు పరిసర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయం కోసం తమను ఆశ్రయించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి:
Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు
Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం