MLA Vivek Venkataswamy: ఎస్సీ వర్గీకరణతో మాలలకు నష్టం
ABN , Publish Date - Feb 24 , 2025 | 06:00 AM
వర్గీకరణకు వ్యతిరేకంగా గ్రామస్థాయిలో చైతన్యం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్రం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపుఇచ్చారు.

తెలంగాణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
కర్నూలులో రాయలసీమ మాలల యుద్ధ గర్జన
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణతో మాల కులస్థులకు నష్టం కలుగుతుందని, వర్గీకరణకు వ్యతిరేకంగా గ్రామస్థాయిలో చైతన్యం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్రం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపుఇచ్చారు. ఆదివారం కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎగ్జిబిషన్ మైదానంలో మా లల జేఏసీ కన్వీనర్ యాట ఓబులేసు అధ్యక్షతన రాయలసీమ మాలల యుద్ధ గర్జన మహాస భ నిర్వహించారు. వెంకటస్వామి మాట్లాడుతూ మాలలు బలీయ శక్తిగా తయారు కావాలని, అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఉద్యమం ఉధృతం దాలుస్తుందన్నారు. మంద కృష్ణ మాది గ పార్లమెంటులో ఎందుకు బిల్లు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదులో మా లల యుద్ధ గర్జన నిర్వహిస్తే తమపై అనేక ఆరోపణలు చేశారన్నారు. ఈ సభలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తదితరులు పాల్గొన్నారు.