Janasena : మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణానికి తెలంగాణ మంత్రులు
ABN , Publish Date - Aug 10 , 2025 | 05:15 PM
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో సందడి నెలకొంది. తెలంగాణ మంత్రులు జనసేన ఆఫీస్ ప్రాంగణానికి విచ్చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు
మంగళగిరి, ఆగష్టు 10 : మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ మంత్రులు మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన ఆఫీస్ ప్రాంగణానికి విచ్చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఇవాళ (ఆదివారం) ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ మంత్రులు మంగళగిరి వచ్చారు. వారు ప్రయాణించిన హెలికాప్టర్ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోని హెలిప్యాడ్‌లో ల్యాండ్ అయింది.
ఈ సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరఫున శాసనమండలి విప్ పి. హరిప్రసాద్, ఇతర జనసేన నాయకులు తెలంగాణ మంత్రులకు స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా, తెలంగాణ మంత్రులకు కొండపల్లి బొమ్మలతో కూడిన జ్ఞాపికలు బహూకరించి జనసేన నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ రాక రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహృద్భావ వాతావరణానికి ప్రతీకగా నిలిచింది.