Share News

Jana Sena Clarifies: పవన్‌పై తెలంగాణ నేతల ఫైర్.. జనసేన క్లారిటీ..

ABN , Publish Date - Dec 02 , 2025 | 09:05 PM

కోనసీమ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ తమను అవమానించారంటూ తెలంగాణ రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jana Sena Clarifies: పవన్‌పై తెలంగాణ నేతల ఫైర్.. జనసేన క్లారిటీ..
Jana Sena Clarifies

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తమను అవమానించారంటూ తెలంగాణ రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తమను అవమానించిన పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. పవన్‌పై విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ఇక, ఈ వివాదంపై జనసేన పార్టీ కార్యాలయం స్పందించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో..


‘రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న క్రమంలో ఆ మాటలు వక్రీకరించవద్దు’ అని స్పష్టం చేసింది.

Untitled.jpg


పవన్‌కు రాజకీయాలు తెలీదు..

తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తెలియదని అన్నారు. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ పవన్ కల్యాణ్‌ను ఆయన డిమాండ్ చేశారు. పవన్ క్షమాపణ చెబితే తెలంగాణలో ఆయన సినిమా ఒకటి, రెండు రోజులు ఆడుతుందన్నారు. లేకుంటే సినిమాలు ఆడవని మంత్రి కోమటిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


ఇవి కూడా చదవండిః

మీ స్కిల్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 15 సెకెన్లలో కనిపెట్టండి

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌.. అన్ని రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానాలు

Updated Date - Dec 02 , 2025 | 09:08 PM