Share News

AP DSC: టీచర్‌ ఉద్యోగాలకు భారీ పోటీ

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:26 AM

ఆంధ్రప్రదేశ్‌లో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు భారీ స్పందన లభించింది. 3.35 లక్షల మంది 5.77 లక్షల దరఖాస్తులు సమర్పించగా, జూన్ 6 నుంచి 30 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి.

AP DSC: టీచర్‌ ఉద్యోగాలకు భారీ పోటీ

16,347 పోస్టులకు 5.77 లక్షల దరఖాస్తులు

సగటున ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ

ఎస్జీటీకి 25, స్కూల్‌ అసిస్టెంట్‌కు 28

పీజీటీ పోస్టులకు ఏకంగా 152 మంది

ఈ నెల 6 నుంచి 30 వరకు పరీక్షలు

87.8 శాతం మందికి ఫస్ట్‌ ఆప్షన్‌ సెంటర్లు

ఆగస్టు రెండో వారంలో ఫలితాలు వెల్లడి

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో పోటీ తీవ్రస్థాయిలో నెలకొంది. 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా 3,35,401 మంది 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. సగటున ఒక్కో పోస్టుకు 35.33 మంది పోటీపడుతున్నారు. వారికి ఈ నెల 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు హాల్‌టికెట్లు శనివారం విడుదలయ్యాయి. కంప్యూటర్‌ ఆధారంగా జరగనున్న ఈ పరీక్షల కోసం రాష్ట్రం సహా ఇతర రాష్ట్రాల్లో 150 సెంటర్లు ఏర్పాటుచేశారు. ఏపీతో పాటు హైదరాబాద్‌, చెన్నై, బరంపురం, బెంగళూరుల్లో పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల కోసం 5 జిల్లాలను ఆప్షన్లుగా ఎంపిక చేసుకోగా 87.8 శాతం మందికి మొదటి ఆప్షన్‌ జిల్లాలోనే పరీక్షా కేంద్రం కేటాయించారు. ఆగస్టు రెండో వారంలో డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి. విజయరామరాజు తెలిపారు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 04:40 AM