TDP: ఘనంగా పల్లా జన్మదిన వేడుకలు
ABN , Publish Date - May 13 , 2025 | 05:06 AM
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పల్లా చేసిన పోరాటాన్ని గుర్తు చేస్తూ పలువురు టీడీపీ నేతలు ఆయనపై ప్రశంసలు కురిపించారు.
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలను ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పల్లా చేసిన పోరాటం ఆయన్ను ప్రజానేతగా నిలిపిందన్నారు. కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బయో డైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయకుమార్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For AndhraPradesh News And Telugu News