Share News

Renewable Energy: గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌కు సహకరించండి

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:49 AM

గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ జీఈసీ 3 ఏర్పాటు విషయమై ఏపీకి సహకరించాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌

Renewable Energy: గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌కు సహకరించండి

  • ‘రామాయపట్నం రిఫైనరీ’ని వేగవంతం చేయండి

  • కేంద్ర మంత్రికి టీడీపీ ఎంపీల బృందం వినతి

న్యూఢిల్లీ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌(జీఈసీ-3) ఏర్పాటు విషయమై ఏపీకి సహకరించాలని కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషిని టీడీపీ ఎంపీలు కోరారు. ఢిల్లీలో సోమవారం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి ఆయనకు వినతి పత్రం అందజేశారు. 2029 నాటికి 72 గిగావాట్ల, 2036-37ఆర్థిక సంవత్సరం నాటికి 30,975 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, దీనికి సహకరించాలని కోరారు. అలాగే, రామాయపట్నం బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటును వేగవంతం చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరిని టీడీపీ ఎంపీలు కోరారు. ఏపీలో పెట్రోలియం, గ్యాస్‌ ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓఎన్జీసీ జాక్‌ అప్‌ రిగ్‌ కాంట్రాక్టు కోసం హిందుస్థాన్‌ షిప్‌ యార్డును పరిగణనలోకి తీసుకోవాలని, పీఎం ఉజ్వల యోజన కింద 65.40 లక్షల దీపం లబ్ధిదారులకు ప్రయోజనాలు కల్పించాలని అన్నారు. కేంద్రమంత్రులను కలిసిన వారిలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నాగరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, బైరెడ్డి శబరి తదితరులు ఉన్నారు.

ఉక్కు కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించండి: శ్రీభరత్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని ఎంపీ శ్రీభరత్‌ కోరారు. సోమవారం ఆయన ఢిల్లీలో మంత్రిని కలిశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రాంగణంలోని కేంద్రీయ విద్యాలయాన్ని కేంద్ర విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావాలన్నారు. అక్కడి.. విమల్‌ విద్యాలయం సిబ్బందికి ఆర్థిక భద్రత కల్పించడానికి స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు చేయాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మందు బాబులకు గుడ్ న్యూస్

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 05:49 AM