తప్పులను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ ఎదురుదాడి : ఎంపీ కలిశెట్టి
ABN , Publish Date - Feb 12 , 2025 | 05:45 AM
‘సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా నాటి వైసీపీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా నాటి వైసీపీ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసింది. అది అక్రమ అరెస్టు అనీ, జగన్ తప్పు చేశాడనీ ఏపీ ప్రజలు నిరూపించారు’ అని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నా రు. మంగళవారం, మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబును చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. కేంద్రం సాయం లభిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైసీపీ నేతలు ఓర్వలేక పార్లమెంట్‌లో, బయట మాట్లాడుతున్న తీరు అన్యాయం. వైసీపీ నేతలు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఎదురు దాడికి పాల్పడుతున్నారు. ఐదేళ్లు ఏపీని దోచుకున్నారు. అస్తవ్యస్థంగా మారిన ఏపీని కఠోర దీక్షతో పట్టాలు ఎక్కించేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు’ అని కలిశెట్టి అన్నారు.