Share News

Narsaraopet MP: జగన్‌పై విచారణ జరపాలి

ABN , Publish Date - Apr 10 , 2025 | 03:15 AM

నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జగన్‌పై చేసిన తప్పుడు ఆరోపణలు, పోలీసులను దుర్భాషలాడడం, వైసీపీ కేడర్‌ను హింసకు ప్రేరేపించడం వంటి చర్యలు జారిచేయడం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు

Narsaraopet MP: జగన్‌పై విచారణ జరపాలి

  • ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

  • పోలీసులను దుర్భాషలాడుతున్నారు

  • వైసీపీ కేడర్‌ను హింసకు ప్రేరేపిస్తున్నారు

  • గద్దె దించేసినప్పటి నుంచీ ప్రజలను రెచ్చగొడుతున్నారు

  • అమిత్‌ షాకు ఎంపీ లావు ఫిర్యాదు

గుంటూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలు తనను అధికారంలో నుంచి దించేసినప్పటి నుంచి జగన్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని నరసరావుపేట ఎంపీ, టీడీపీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. పోలీసులను దుర్భాషలాడుతూ.. వైసీపీ కేడర్‌ను హింసకు ప్రేరేపిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయనకు లేఖ రాశారు. జగన్‌ తరచుగా పోలీసులను తిడుతూ హెచ్చరికలు జారీ చేయడం, తనకు సెక్యూరిటీగా ఉన్న పోలీసులనే బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ‘గత ఏడాది జూలై 22న అసెంబ్లీ గేటు వద్ద అధికారులను దూషించారు. 2024 నవంబరు 7న డీజీపీతో పాటు పోలీసు అధికారులెవరినీ వదిలిపెట్టనని, సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకొచ్చి శిక్షిస్తామని బెదిరించారు.


ఈ ఏడాది జనవరి 13న పులివెందుల హెలిప్యాడ్‌ వద్ద డీఎ్‌సపీ మురళీ నాయక్‌ను హెచ్చరించారు. ఫిబ్రవరి 18న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జైలులో పరామర్శించడానికి వెళ్లి.. పోలీసు అధికారులెవరినీ వదిలిపెట్టను. వాళ్లు రిటైరైనా లాక్కొచ్చి శిక్షిస్తామన్నారు.. గత నెల 25న వైసీపీకి చెందిన సోషల్‌ మీడియా కార్యకర్తకు అభయమిస్తూ.. అధికారంలోకి రాగానే డీఎ్‌సపీ, సీఐతో నీకు సెల్యూట్‌ చేయిస్తానని చెప్పారు. ఈ మంగళవారం (8న) శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లికి వెళ్లి పోలీసుల దుస్తులు ఊడదీయిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల దృష్ట్యా జగన్‌ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలి. రాజ్యాంగాన్ని కాపాడాలి’ అని షాను కోరారు.

Updated Date - Apr 10 , 2025 | 03:15 AM