Kadapa TDP: కడప మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది: సీఎం
ABN , Publish Date - May 15 , 2025 | 03:31 AM
కడపలో తొలిసారిగా నిర్వహించబోయే మహానాడు చరిత్రలో గుర్తుండిపోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధిపై మరిన్ని చర్చలు, పరస్పర సూచనలతో ఈ మహానాడు నిర్వహించాలని పార్టీ నేతలను సూచించారు.
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): కడపలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో గుర్తుండిపోతుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అన్నారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు నిర్వహణ కమిటీ బాధ్యులు, ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాయలసీమను దశాబ్దాల తరబడి పట్టిపీడిస్తున్న ఫ్యాక్షన్ భూతాన్ని సమూలంగా అంతం చేసిన చరిత్ర టీడీపీదని తెలిపారు. ఎడారిగా మారుతున్న అనంతపురం జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి తాగు, సాగునీరు ఇచ్చామని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సీమలో కరువుకు సమాధానం చెప్పామని వివరించారు. రాయలసీమలో పరిశ్రమలు, డెయిరీలు అభివృద్ధి చేస్తున్నామని, హార్టికల్చర్‌లో వచ్చే మార్పులతో సీమ రైతులు కోనసీమ రైతులను అధిగమిస్తారని అన్నారు. పార్టీ నేతలు ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చ పెట్టాలని సూచించారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 22, 23 తేదీల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో మినీ మహానాడులను నిర్వహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News