Share News

Srikakulam: సారు.. తూకానికీ రేటు

ABN , Publish Date - May 23 , 2025 | 05:37 AM

శ్రీకాకుళం జిల్లాలో తూనికల అధికారి టి.శ్రీధర్ రూ.1.78 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆయన 445 వ్యాపారుల నుండి అదనపు సీళ్లు వసూలు చేసినట్లు నిర్ధారణైంది.

Srikakulam: సారు.. తూకానికీ రేటు

చలానా కంటే అదనంగా రూ.400 డిమాండ్‌

రూ.1.78 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కాశీబుగ్గ డివిజన్‌ తూనికలు-కొలతల శాఖ అధికారి

పలాస, మే 22(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గలో పనిచేస్తున్న తూనికలు-కొలతల శాఖ అధికారి టి.శ్రీధర్‌ రూ.1.78 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. ఈయన ఎలకా్ట్రనిక్‌ తూకాలకు ఏడాదికోసారి వేయాల్సిన సీళ్లు కోసం ప్రభుత్వ చలానా కన్నా అదనంగా రూ.400 డిమాండ్‌ చేశారు. ఈ విధంగా కాశీబుగ్గ తూనికలు-కొలతలశాఖ పరిధిలో ఉన్న మొత్తం 14 మండలాలకు చెందిన 445 మంది వ్యాపారుల నుంచి రూ.1.78 లక్షలు లంచం తీసుకున్నారు. దీంతోపాటు ఏడాది నుంచి సంబంధిత కాటాలకు సీళ్లు వేయకుండా.. అదనపు డబ్బుల కోసం కార్యాలయం చుట్టు తమను తిప్పుతున్నట్టు వ్యాపారులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యాపారుల నుంచి రూ.1.78 లక్షలు లంచం తీసుకుంటున్న శ్రీధర్‌ను శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి బృందం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆయన్ను శుక్రవారం విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలాస రెవిన్యూ సబ్‌ డివిజన్‌లో ఓ అధికారిపై ఏసీబీ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి.


ఈ వార్తలు కూడా చదవండి..

పాక్‌ను మోకాళ్లపై నిలబెట్టాం

భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్

For National News And Telugu News

Updated Date - May 23 , 2025 | 05:37 AM