Share News

Swarnandhra Sankalpam: అధికారుల జనం బాట

ABN , Publish Date - May 06 , 2025 | 05:01 AM

కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర సంకల్పం కార్యక్రమం ద్వారా ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు 21, 22, 23 మే తేదీలలో 450 సచివాలయాల్లో పర్యటన చేపట్టేందుకు నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారి లు భాగస్వాములుగా పాల్గొని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారు.

 Swarnandhra Sankalpam: అధికారుల జనం బాట

  • 21 నుంచి మూడ్రోజులు ‘స్వర్ణాంధ్ర సంకల్పం’

  • తొలి విడత 450 సచివాలయాల్లో నిర్వహణ

  • పాల్గొననున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌, హెచ్‌వోడీలు

  • ప్రభుత్వ పనితీరు, పథకాలపై అభిప్రాయ సేకరణ

  • సమస్యల పరిష్కారరపై ప్రధానంగా దృష్టి

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏమనుకుంటున్నారు? పథకాలన్నీ ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా? ప్రభుత్వం నుంచి జనం ఇంకా ఏం ఆశిస్తున్నారు? ప్రస్తుతం అ ందుతున్న పథకాలపై లబ్ధిదారులు సంతృప్తిగా ఉన్నారా? ఇలాంటి ప్రశ్నలకు వారి నుంచే సమాధానం తెలుసుకునేందుకు సర్కార్‌ సమాయత్తమైం ది. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ‘సర్ణాంధ్ర సంకల్పం’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మే 21, 22, 23 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. గత నెల 3న జరిగిన కేబినెట్‌ సమావేశంలో.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, అప్పుడే ప్రజాభిప్రాయాన్ని నిష్పక్షపాతంగా తెలుసుకోగలమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అప్పటి కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయానికి కార్యరూపం ఇస్తూ ‘స్వర్ణాంధ్ర సంకల్పం’కు రూపకల్పన చేశారు. తొలి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 450 సచివాలయాలను ఎంపిక చేసుకుని ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ సచివాలయాల ఎంపిక కేవలం పట్ణణ ప్రాంతాలకు పరిమితం కాకుండా అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేలా చూడనున్నారు. తొలి విడతలో ఐఏఎస్‌, ఐపీఎ్‌సలతోపాటు హెచ్‌వోడీలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు. ఆ తర్వాత జరిగే కార్యక్రమంలో జిల్లాస్థాయి అధికారులనూ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగితే ప్రభుత్వ పనితీరుపై మరింత మెరుగైన సమాచారం తెలుసుకోవచ్చని, క్షేత్ర స్థాయిలో నెలకొ న్న సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారానికి ఓ రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని సీఎం భావిస్తున్నారు. ప్రతి అధికారి ఎంపిక చేసుకున్న ప్రాంతంలో మూడు పగళ్లు.. రెం డు రాత్రుళ్లు గడిపి, స్థానికులతో మమేకమై వారి అభిప్రాయాలు, స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవాలన్నది స్థూలంగా ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ కార్య క్రమంలో ఎక్కడా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల జోక్యం ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది.


  • ‘స్వర్ణాంధ్ర సంకల్పం’లో ఏం చేస్తారంటే..

  1. ప్రతి అధికారి ఎంపిక చేసుకున్న ప్రాంతంలోని సచివాలయాన్ని తప్పనిసరిగా సందర్శించాలి. అక్కడ సిబ్బంది ఎలా పనిచేస్తున్నారు.. అక్కడున్న సమస్యలు.. సచివాలయాలకు వస్తున్న ప్రజలకు సరైన విధంగా సేవలు అందుతున్నాయా అన్న అంశాలను పరిశీలిస్తారు.

  2. ఆ తర్వాత రేషన్‌ షాపులు, అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలను సందర్శించి వాటి స్థితిగతులను పరిశీలిస్తారు. డ్వాక్రా గ్రూపులు, రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు.

  3. ఒక రాత్రి స్థానికులతో సమావేశం ఏర్పాటు చేసుకుని, స్థానిక అవసరాలు, సమస్యలపై సమగ్రంగా చర్చిస్తారు.

  4. ఒక రోజు సచివాలయం పరిధిలోని ఇంటింటికీ తిరిగి ప్రజలతో మాట్లాడుతారు. లబ్ధిదారుల నుంచి పథకాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటారు. చివరిగా స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు.

  5. స్వర్ణాంధ్ర సంకల్పం పర్యటన వివరాలను పొందుపరిచేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించారు. అధికారులు తమ పర్యటనలో తెలుసుకున్న వివరాలను అందులో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

Updated Date - May 06 , 2025 | 05:03 AM